H1-B వీసాదారులకు భారీ ఊరట లభించింది. వారి జీవిత భాగస్వాములు కూడా పనిచేసేందుకు అవకాశమిచ్చే నిబంధనను సవాలు చేస్తూ ‘సేవ్ జాబ్స్ USA’ అనే సంస్థ వేసిన పిటిషన్‌ను కొలంబియా కోర్టు కొట్టివేసింది. భాగస్వాములకు ఉద్యోగాలివ్వరాదని, స్థానికులనే ఛాన్సులివ్వాలని కోరుతూ సంస్థ పిటిషన్‌లో కోరింది. దాన్ని తోసిపుచ్చిన కోర్టు, నిబంధనల విషయంలో DHSకి ఇమ్రిగేషన్ చట్టం విస్తృత అధికారాలను కల్పిస్తుందని పేర్కొంది.