జామి మండలం భీమసింగి జంక్షన్ వద్ద గల నాలుగు రోడ్ల కూడలిలో ఓ లారీ ఆదివారం ఉదయం నిలిచిపోయింది. కొత్తవలస నుండి విజయనగరం, ఎస్. కోట నుండి విజయనగరం వెళ్లేందుకు ఈ నాలుగు రోడ్ల కూడలి గుండా వాహనాలు రాకపోకలు సాధిస్తుంటాయి. ఈ నేపథ్యంలో భారీ వాహనం రోడ్డుపై నిలిచిపోవడంతో అటుగా ప్రయాణించే వాహనదారులు ఒకింత అసౌకర్యానికి గురయ్యారు. లారీని అక్కడ నుండి తొలగించేందుకు లారీ యజమానులు చర్యలు చేపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa