రొంపిచర్ల మండలం విప్పర్లలో స్నేహితుల దినోత్సవం రోజున ఆదివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రోహిత్ హైదరాబాదులో సాఫ్ట్వేర్ గా పని చేస్తున్నాడు. వీకెండ్ కావడంతో అదే గ్రామానికి చెందిన బాల అనే స్నేహితుడు హైదరాబాదుకు వెళ్లి కేబుల్ బ్రిడ్జిపై నుంచి వస్తున్న క్రమంలో డివైడర్ని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు వెంటనే హైదరాబాద్ చేరుకొని మృతులను స్వగ్రామానికి తరలిస్తున్నారు.