మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలలో గుండె ఒకటి. ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లకారణంగా చిన్న వయసులోనే చాలా మంది గుండె జబ్బులతో బాధపడుతున్నారు. అలాగే కొంతమంది గుండెపోటుతో మరణిస్తున్నారు. గుండెపోటు అనేది గుండెకు రక్త సరఫరాలో ఆకస్మిక అంతరాయం కారణంగా ఏర్పడే అత్యవసర వైద్య పరిస్థితి. ఈ నేపథ్యంలో గుండె ఆరోగ్యంగా ఉండడానికి ఏ ఆహార పదార్థాలు తినడం తగ్గించాలో అనే విషయంపై ఆరోగ్య నిపుణులు సలహాలను ప్రతి ఒక్కరూ పాటించాలి.