వర్షాలు తగ్గుముఖం పట్టడంతో రైతుల సాగు అవసరాలకు డెల్టా కాలువలకు నీటి విడుదలను పెంచారు. నిడదవోలు మండలం విజ్జేశ్వరం హెడ్ స్లూయిజ్ నుంచి పశ్చిమ డెల్టా ప్రధాన కాలువకు ఆదివారం 4, 000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. తూర్పు డెల్టాకు 3, 800, సెంట్రల్ డెల్టాకు 1400, పశ్చిమ డెల్టా పరిధిలోని ఏలూరు కాలువకు 613, నరసాపురం కాలువకు 1342, తణుకు కాలువకు 275, అత్తిలి కాలువకు 108 క్యూసెక్కులు విడుదల చేశారు.