తన దృష్టికి వచ్చిన అనేక ప్రజా సమస్యలకు మంత్రి నారా లోకేష్ గారు వెంటనే స్పందిస్తూ వాటిని పరిష్కరిస్తున్న వైనాన్ని నిత్యం చూస్తూనే ఉన్నాం. అలాంటిదే మరొకటి జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం అత్తిలి గ్రామానికి చెందిన బసవయ్య అనే విద్యార్థికి ఐఐఐటీ లక్నోలో సీటు వచ్చింది. అయితే ఆ కోర్సు ఫీజు రూ.4 లక్షలుగా ఉండటంతో... "తన కుటుంబం ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అంత ఫీజు చెల్లించలే"నంటూ బసవయ్య లోకేష్ గారికి ట్వీట్ ద్వారా తెలియజేసి సాయం అడిగాడు. బసవయ్య చేసిన ట్వీట్‌పై స్పందించిన లోకేష్ గారు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. "నువ్వు ఐఐఐటీ లక్నోలో చదివి, నీ కలను సాకారం చేసుకుంటావు.. ఫీజు సంగతి నాకొదిలేయ్.. ఆల్ ద బెస్ట్!" అంటూ బసవయ్యకు రిప్లై ఇచ్చారు. ఇది తెలిసిన ప్రజలు 'అసలైన ప్రజానేత' అంటూ లోకేష్ గారిని వేనోళ్ళ పొగుడుతున్నారు.