గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలు ఎన్నో బాధలు పడుతున్నా, సహాయక చర్యల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కొన్ని చోట్ల పర్యటించిన మంత్రులు, ఎమ్మెల్యేలు బాధితులకు సాయం చేయకుండా కేవలం ఫోటోలకే పరిమితమయ్యారని, రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ వెల్లడించారు. అదే గతంలో తమ ప్రభుత్వ హయాంలో గోదావరి వరదలు పోటెత్తి.. ముంపునకు గురైన కూనవరం, దేవీపట్నం వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వం తక్షణమే స్పందించి సహాయక చర్యలు మొదలు పెట్టందని, బాధితులను ఆదుకోవడంలో నాటి సీఎం వైయస్ జగన్ వేగంగా స్పందించారని ఆయన గుర్తు చేశారు. బాధితులకు రేషన్‌తో పాటు, పరిహారం కూడా సకాలంలో అందించారని చెప్పారు.