ఆంధ్రప్రదేశ్‌లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. ఈ సదస్సులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. 97శాతం స్ట్రైకింగ్ రేట్‌తో ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిందన్నారు. తాము అనేక బాధలు పడి.. ఇబ్బందులు పడి అవమానాలకు గురై ఈ ప్రభుత్వాన్ని స్ధాపించడానికి కారణం వ్యవస్థలను కాపాడటంతో పాటు బలోపేతం చేయడానికేనని పేర్కొన్నారు. ‘ మేము ఈసారి అధికారంలోకి రాకపోయినా ప్రజాస్వామ్యంలో నిలబడి ఈ వ్యవస్థను బలోపేతం చేయాలని వచ్చాం. మాది మంచి ప్రభుత్వం.. అకౌంటిబులిటీ ఉన్న ప్రభుత్వం. గత అయిదేళ్లుగా పాలన ఎలా ఉందో అందరూ చూశారు’ అని పవన్ చెప్పుకొచ్చారు.