విజయవాడ, వెటర్నరీ కాలనీలోని వీఎంసీ పార్క్ లో నూతనంగా నిర్మించిన జిమ్ ను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. వెటర్నరీ కాలనీ వాసులు జిమ్ కోసం సొంతంగా డబ్బు సమకూర్చారన్నారు. వీఎంసీ ఆధ్వర్యంలో ఈ పార్కు నిర్వహణ జరుగుతుందన్నారు. గ్రీన్ డెవలప్మెంట్, పర్యావరణంపై సీఎం చంద్రబాబుతో చర్చించానని తెలిపారు. కాలనీల్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేలా చేస్తామన్నారు. ఈ ప్రాంతంలో కొన్ని సమస్యలు తనకు చెప్పారని..వాటిని పరిష్కారిస్తామన్నారు. వారం క్రితం మున్సిపల్ అధికారులతో సమీక్ష చేశానని మంత్రి నారాయణ తెలిపారు.