బుచ్చయ్యపేట మండలంలోని వడ్డాది గ్రామంలో మంగళవారం తల్లిపాల వారోత్సవాల అవగాహన ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా వైద్యాధికారి మౌనిక మాట్లాడుతూ ప్రతి బిడ్డకు తల్లిపాలు అందించడమే మన సంకల్పం నినాదాలతో ర్యాలీ జరిపారు. స్థానిక పిహెచ్సిలో పౌష్టికాహార ప్రదర్శన ఏర్పాటు చేసి తల్లిపాల ప్రాధాన్యమును వివరించారు. తల్లి పాలు పెట్టడం ద్వారా శిశువుకు మెరుగైన ఆరోగ్యం లభిస్తుందన్నారు. అంగనవాడి, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.