సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణానికి కూటమి ప్రభుత్వం మరిన్ని నిధులు మంజూరు చేసి తద్వారా ఉత్తరాంధ్రకు న్యాయం చేయాలని ఆముదాలవలసకు చెందిన మాజీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నాయకులు పేడాడ జనార్దన్ రావు అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం మాట్లాడుతూ గత వైసీపీ పాలకులు బటన్ నొక్కితే పనిలో పడి ఉత్తరాంధ్ర అభివృద్ధిని తోక్కేశారని వాపోయారు. ఈ ప్రాజెక్టును కూటమి పూర్తిచేసే రైతులకు న్యాయం చేయాలన్నారు.