కూటమి సర్కారు కొలువు తీరిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులకు స్పష్టమైన మార్గనిర్దేశం చేశారు. అధికార దర్పానికి దూరంగా ఉండాలని... పేదలకు దగ్గర కావాలని సూచించారు. ఎమ్మెల్యేలూ, మంత్రులకూ ఇదే చెప్పారు. ‘మా ప్రభుత్వ విధానం, మా లక్ష్యాలు ఇవి! మీరు వినూత్నంగా ఆలోచించండి. మనసుపెట్టి పని చేయండి. ఫలితాలు సాధించండి’ అని కలెక్టర్లకు చంద్రబాబు సూచించారు. ఎప్పటికప్పుడు అందరి పనితీరు సమీక్షిస్తుంటానని కూడా చెప్పారు.