ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గన్నవరం తహసీల్దార్‌ పై బదిలీ వేటు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 06, 2024, 09:13 PM

వివాదాస్పద గన్నవరం తహసీల్దార్‌ పవన్‌కుమార్‌ పై ఎట్టకేలకు బదిలీ వేటు వేశారు. ఆయన్ను తూర్పు గోదావరి జిల్లాకు బదిలీ చేస్తూ కలెక్టర్‌ బాలాజీ ఆదేశాలు జారీ చేశారు. ఇతర జిల్లా నుంచి వచ్చిన వ్యక్తిని ఎందుకు కొనసాగిస్తున్నారని, తహసీల్దార్‌గా అతనికి పొడిగించిన గడువు కూడా ముగిసిందని, తక్షణం సీసీఎల్‌ఏకు రిపోర్టు చేయాలని కలెక్టర్‌ను సీసీఎల్‌ఏ ఆదేశించింది. దీంతో పవన్‌కుమార్‌ను తూర్పుగోదావరి జిల్లాకు రిలీవ్‌ చేస్తూ కలెక్టర్‌ బాలాజీ ఆదేశాలిచ్చారు. తొలుత గన్నవరం డీటీ అరుణ్‌కు తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించినా, ఆ వెంటనే సివిల్‌ సప్లయిస్‌లో పనిచేస్తున్న కె.వెంకటశివయ్యను గన్నవరం తహసీల్దార్‌గా నియమించారు. శివయ్య ఉమ్మడి కృష్ణాజిల్లాలో పనిచేశారు. విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (వీఎంసీ)లో ఎస్టేట్‌ ఆఫీసర్‌ (ఈవో)గా విధులు నిర్వహించారు. మైలవరం తదితర మండలాల్లో తహసీల్దార్‌గా పనిచేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com