రాష్ట్రంలో వర్చువల్ వర్కింగ్ పాలసీని తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఒత్తిడి లేని విద్యావిధానం అవసరమని, పిల్లలంతా కచ్చితంగా బడిలో ఉండాల్సిందేనని ఆయన ఆదేశించారు. కలెక్టర్ల సదస్సులో ఈ మేరకు అధికారులను ఆదేశించారు. సదస్సులో భాగంగా మానవ వనరులు, నైపుణ్యాభివృద్ధి శాఖలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ‘‘ప్రస్తుతం ఇంటి నుంచి పనిచేసే విధానం పెరిగింది. భవిష్యత్తులో వర్చువల్ వర్కింగ్‌కు అవకాశాలెక్కువ. దీనికోసం తొలుత డ్రాఫ్ట్ పాలసీ రూపొందించి, దానిపై నిపుణులతో చర్చించాలి. ఆంధ్రప్రదేశ్ వర్చువల్ వర్కింగ్‌కు హబ్‌గా మారాలి’’ అని చంద్రబాబు ఆకాంక్షించారు.