జనసేన పార్టీని బలోపేతం చేయాలని తంబళపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇనచార్జ్ పోతుల సాయినాథ్ పిలుపు నిచ్చా రు. పెద్దమండ్యం మండలంలోని పెద్దమండ్యం, సిద్దవరం, కలిచెర్ల గ్రామాల్లో ఆయన సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా కార్యకర్తల సమావేశం నిర్వ హించారు. సభ్యత్వ నమోదు వివరాలను ఆ పార్టీ కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర జనసేన పారీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన కల్యాణ్ ఆదేశాల మేరకు తంబళ్లపల్లి నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వం నమోదు చేస్తున్నట్లు తెలిపారు. 2500 మందిని చేర్చుకున్నట్లు వివరించారు. ముందుగా ఆయన కూటమి నేత లతో కలసి పెద్దమండ్యం మండల అధికారులు, జీఎస్ సిబ్బందితో మాట్లాడారు. సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలను అందజేశారు. ప్రజా సమ స్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఎంపీటీసీ సభ్యుడు రుక్మాంగదరెడ్డి, మండల జనసేన అధ్యక్షుడు శంకర మాజీ సర్పంచ నాగార్జున కూటమి నే తలు సిద్దవరం ప్రసాద్, దత్తాత్రేయరెడ్డి, ప్రభాకరరెడ్డి, సయ్యద్షావలి, ఇ స్మాయిల్, బావాజీ, ప్రకాష్‌రెడ్డి, మేకల చలపతి, నాగూరువలి, అస్రాఫ్ తదితరులు పాల్గొన్నారు.