తిరుపతి నగరంలో సోమవారం రాత్రి మంచివర్షం కురిసింది. బంగాళఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో పగలంతా ఎండ తీవ్రత కొనసాగింది. రాత్రి దాదాపు గంటపాటు జోరు వర్షం కురిసింది. రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి. అండర్ బ్రిడ్జిల్లో నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఆర్టీసీ బస్టాండులో, కూరగాయల మార్కెట్లో నీరు నిలవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాతావరణం చల్లబడడంతో ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు.