మాజీ మంత్రి కొడాలినాని, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీలను మాజీ మంత్రి పేర్నినాని దాచాడంటూ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. శవం లెగిస్తే తప్ప జగన్ ఏపీకి రావాట్లేదంటూ కొల్లు ఫైర్ అయ్యారు. మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. తన భద్రత పెంచాలని జగన్ అంటుంటే... జగన్ నుంచి తమకు భద్రత కావాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. ఏపీలో ఎవరైనా చనిపోయి శవం కనిపిస్తే .. గద్దలా వాలటానికి జగన్ వస్తున్నారని విమర్శలు గుప్పించారు.