కాకినాడ జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పార్టీకి రాజీనామా చేస్తారంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆయన రాజీనామా చేయాలని డిసైడ్ అయిపోయారట. వైసీపీకి రాజీనామాపై ముఖ్య నాయకులకు ఇప్పటికే పెండెం దొరబాబు క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దొరబాబుతో పాటు పలువురు నియోజకవర్గ ముఖ్య నేతలు వైసీపీని వీడనున్నారు. వీరంతా బుధవారం రాజీనామాలు చేసే అవకాశం ఉంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం సిట్టింగ్ సీటును దొరబాబుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ టికెట్‌ను వంగా గీతకు కేటాయించారు. పవన్ చేతిలో గీత పరాజయం పాలయ్యారు. ఆసక్తికర విషయం ఏంటంటే.. పవన్‌పై పోటీకి సిద్ధమైన దొరబాబే.. వైసీపీకి రాజీనామా చేసి జనసేనలోకి వెళ్లేందుకు ఉత్సాహం ప్రదర్శించడం.