‘పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి రక్షిత మంచినీటి సరఫరా, అటవీశాఖ, శాస్త్రసాంకేతిక శాఖలను తీసుకున్నాను. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి తీర్మానాలు చేస్తున్నాం. తద్వారా పంచాయతీలను బలోపేతం చేస్తాం అని జనసేన నేత పవన్ కళ్యాణ్ అన్నారు. అయన మాట్లాడుతూ.... గ్రామాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ అమలు చేస్తున్నాం. పిఠాపురం నియోజకవర్గంలో లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌ను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాం. జలజీవన్ మిషన్ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 5.4 కోట్ల గృహలకు తాగునీరివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలో 4721 కిలోమీటర్ల రోడ్లను మరమ్మతు చేయాలని నిర్ణయించాం. రాష్ట్ర వ్యాప్తంగా 29.23 శాతం 37,400 చదరపు కిలోమీటర్ల నోటిఫై చేసిన అడవులున్నాయి. నోటిఫై చేసిన అటవీ పరిధికి అదనంగా 10,221 చదరపు కీలోమీటర్ల గ్రీన్ కారిడర్ ఉంది. చెరువు తీరాలు, ఇన్‌స్టిట్యూట్ ల్యాండ్స్, పంచాయతీ ల్యాండ్స్‌లో కూడా అటవీకరణను ప్రోత్సహించాల్సిన ఉంది. గుంటూరు, కర్నూలు, పశ్చిమగోదావరి జిల్లాల్లో అడవులు పెంచేందుకు కృషి చేయాల్సి ఉంది’ అని పవన్ అన్నారు.