రాష్ట్రంలో జరుగుతున్న దాడులను ఆపాలని కూటమి ప్రభుత్వాన్ని వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి హెచ్చరించారు. కేవలం ఆధిపత్యం చాటడం కోసం ఒక పథకం ప్రకారం నవాబ్‌పేట్ దాడి ఘటన జరిగిందని వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. దాడిలో గాయపడిన వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలిద్దరినీ మంగళవారం సాయంత్రం విజయవాడ ఆస్పత్రిలో వైయస్ జగన్ పరామర్శించారు. అయన మాట్లాడుతూ..... మీరు చేసే ఈ కిరాతకాలు, దారుణాల వల్ల ప్రజలేమైనా భయపడతారనుకుంటున్నారా? ఎవరూ భయపడరు. ఇంకా కోపంగా మారుతారు. అలా మారి, చంద్రబాబుగారిని, తెలుగుదేశం పార్టీ.. రెండింటినీ బంగాళాఖాతంలో కలిపే పరిస్థితులకు దారి తీస్తాయి. మామూలుగా కొత్త ప్రభుత్వం వస్తే, ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి కాస్తో కూస్తో టైమ్ పడుతుంది. మొట్టమొదటిసారిగా చూస్తున్నాం. చంద్రబాబుగారి మీద వ్యతిరేకత అన్నది చాలా వేగంగా పెరుగుతోంది. నిజంగా ముఖ్యమంత్రి అనే వ్యక్తి పరిపాలన మీద దృష్టి పెట్టాల్సింది పోయి, ఏం చేస్తున్నాడనేది తనను తాను ప్రశ్నించుకోవాలని కోరారు.