సృజనాత్మకతకు నైపుణ్యానికి నెలవైన చేనేతను ప్రోత్సహించడం అందరి బాధ్యత అని కేంద్ర విమానాయన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా నేతన్నలకు నా శుభాకాంక్షలు అంటూ బుధవారం ఉదయం ఆయన (X)లో పోస్ట్ చేశారు. చేనేత వస్త్రాలను ప్రోత్సహిద్దామని, నేతన్నలకు అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు.