కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో 400 మందికి పైగా మృత్యువాతపడ్డారని కడప రైల్వే గూడ్స్ షేడ్ హమాలీ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి బాదుల్లా తెలిపారు. కేరళ వరద బాధితులకు అండగా నిలించేందుకు గురువారం స్థానిక రైల్వే స్టేషన్ లోని షాపుల వద్ద హమాలీ కార్మికులు నిధుల సమీకరణ చేపట్టారు. ప్రజల నుంచి రూ. 3810 వరకు వసూలైంది. వందలాది మంది గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు.