బి.కోడూరు మండలంలో గత ప్రభుత్వంలో రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూములన్నీ ఆన్లైన్ చేశారని, వాటన్నింటి పైనా విచారణ జరపాలంటూ టీడీపీ నేతలు బుధవారం తహసీల్దారు కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్నెల్లి గ్రామంలోని 767 సర్వే నెంబరులో 9 ఎకరాల 88 సెంట్లు , 793 సర్వేనెంబరులో 6 ఎకరాల 72 సెంట్లు, 775 సర్వేనెంబరులో 2 ఎకరాల 69 సెంట్లు , కొంతమంది అక్రమంగా ఆనలైన చేయించుకుని వివిధ బ్యాంకుల్లో రుణాలు పొందారని ఆరోపించారు. తంగేడుపల్లెలో 284/1, 284/2 సర్వేనెంబర్లలోని 8.68 ఎకరాలు, 8.64 ఎకరాల భూమి అక్కినగుండ్ల సాలమ్మ భర్త సుబ్బ రాయుడు, అక్కిన గుండ్ల రామతులసి భర్త వెంకటసుబ్బయ పేర్లతో ఉండగా, దానిని 22/ఎకింద ఆనలైన చేశారని , బద్వేలు, పోరుమామిళ్ల మెయినరోడ్డులో స్థానికేతరులకు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని ధారాదత్తం చేశారని ఆరోపించారు. 2023 నుంచి 2024 మార్చి వరకు ఆనలైనలో నమోదైన ప్రభుత్వ భూమి వివరాలను బహిర్గతం చేసి విచారణ చేయిం చి చర్యలు తీసుకోవాలని కోరారు. తహసీల్దా రు కార్యాలయం ఎదుట ఆందోళన చేసిన అ నంతరం తహసీల్దారు ఆలీఖానకు వినతి ప త్రం అందించారు. దీనిపై తహసీల్దారు మా ట్లాడుతూ ఆరోపణలు వాస్తవం కావచ్చని, కానీ వాటిని పరిశీలించేందుకు తమ దగ్గర ఎలాంటి రికార్డులు లేవన్నారు. బద్వేలు ఆర్డీవో కార్యాలయం లో ఉన్న రికార్డులను తెప్పించి పరిశీలిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు రామచంద్రరెడ్డి, గోడి రమణారెడ్డి, శంకర్‌రెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, రామ్మోహనరెడ్డి, మద్దిరెడ్డి, నారాయణరెడ్డి, గోవిందాయ పల్లె గ్రామ ప్రజలు, తంగేడుపల్లె గ్రామ ప్రజలు పాల్గొన్నారు.