తిరుమలలో రెండో పెళ్లి వివాదం తెరపైకి వచ్చింది. హైదరాబాద్కు చెందిన రాకేష్ అనే వ్యక్తి తిరుమలలోని ఓ మఠంలో రెండో వివాహానికి సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న మొదటి భార్య సంధ్య అక్కడికి చేరుకుంది. ఆమెను చూసిన రాకేష్ కళ్యాణ మండపం నుంచి పారిపోయాడు. ఈ మేరకు కొంత మందిని పట్టుకున్న సంధ్య కుటుంబ సభ్యులు తిరుమల పీఎస్లో వారిని అప్పగించారు.