గోపికృష్ణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు కేవీ రమణారెడ్డి అందించిన సేవలు స్ఫూర్తిదాయకమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి, ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కొనియాడారు. కేవీ రమణారెడ్డి తృతీయ వర్ధంతి సందర్భంగా గురువారం ప్రొద్దుటూరు పరిధి దొరసానిపల్లె గోపికృష్ణ హైస్కూల్ లో ఆయన కుమారులు కృష్ణ ప్రదీప్ రెడ్డి, సందీప్ రెడ్డి 500 మంది పేదలకు నిత్యావసర వస్తువులు, మొక్కలు పంపిణీ చేశారు.