నూజివీడు రూరల్ పరిధిలో సరైన పత్రాలు లేని వాహనాలను పోలీసులు తనిఖీ చేసి శుక్రవారం చలానాలు విధించారు. హెల్మెట్లు లేని వారికి అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనం నడిపే సమయంలో ప్రతి ఒక్కరు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని రూరల్ ఎస్సై ఆర్ మల్లికార్జునరెడ్డి సూచించారు. ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో మీకు ప్రాణ రక్షణగా హెల్మెట్ ఉంటుందని ప్రతి ఒక్కరు గ్రహించాలని తెలిపారు.