రాష్ట్ర రవాణా రంగాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందనిమంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శుక్రవారం మచిలీపట్నం బస్టాండు వద్ద నూతనంగా కొనుగోలు చేసిన బస్సుల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు గజమాలతో సత్కరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. జెండా ఊపి బస్సుల్ని ప్రజలకు అంకితమిచ్చారు.