వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం మరో మలుపు తిరిగింది. దువ్వాడ శ్రీనివాస్‌ను తాను ట్రాప్ చేయలేదని.. దువ్వాడ సతీమణి దువ్వాడ వాణి పాలిటిక్స్‌లో తనను ట్రాప్ చేశారంటూ దివ్వల మాధురి ఆరోపించారు. దువ్వాడ వాణి టికెట్ పొందడానికి తనను ట్రాప్ చేసి వాడుకున్నారని దివ్వల మాధురి ఆరోపించారు. దువ్వాడ శ్రీనివాస్‌కు, వాణికి మధ్య ఏమైనా విబేధాలు ఉంటే వారే మాట్లాడుకోవాలని.. అనవసరంగా తనను లాగొద్దన్నారు. దువ్వాడ వాణి మాటలు విని తనను ఈ విషయంలోకి లాగొద్దంటూ విజ్ఞప్తి చేశారు.
తండ్రీ.. తండ్రీ అంటున్న దువ్వాడ శ్రీనివాస్ పిల్లలు ఈ రెండేళ్లు ఏమైపోయారని దివ్వల మాధురి ప్రశ్నించారు. దువ్వాడ శ్రీనివాస్ కొన్ని రోజులు రోడ్డుపై ఉండిపోయారని.. ఆ సమయంలో ఈ పిల్లలు ఏమైపోయారని ప్రశ్నించారు. దువ్వాడ వాణి.. శ్రీనివాస్‌ను ఇంట్లోకి రానీయకపోతే తాను ఉంచుకోవాల్సి వచ్చిందన్నారు. శ్రీనివాస్ బ్యాంకు బ్యాలెన్స్ జీరో అని... అతని వద్ద ఆస్తులేమీ లేవన్నారు. ఉన్నవి మొత్తం కుటుంబానికే ఇచ్చేశారని చెప్పారు. మా ఆయన జీతం పది లక్షలు.. మా కుటుంబం ఆర్థికంగా మంచి స్థానంలో ఉందని.. శ్రీనివాస్‌ను ట్రాప్ చేయాల్సిన అవసరం తనకు ఏమిటని ప్రశ్నించారు. అలాంటి ఆయనను డబ్బుకోసం ట్రాప్ చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. దువ్వాడ శ్రీనివాస్ ఎన్నికల కోసం కూడా తన సొంత డబ్బులు రెండు కోట్లు ఖర్చు చేశానని చెప్పారు.
రెండేళ్ల నుంచి తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్న దివ్వల మాధురి.. కుటుంబంలో వివాదాలు ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలని లేదంటే కోర్టుకు వెళ్లాలన్నారు. తనకు ముగ్గురు కూతుర్లు ఉన్నారన్న దివ్వల మాధురి.. ఈ వార్తలతో వారి భవిష్యత్ ఏం కావాలని ప్రశ్నించారు. ఆరోపణల కారణంగా తన కుటుంబానికి, భర్తకు దూరమైపోయాయన్న దివ్వల మాధురి.. ఇప్పుడు తాను ఏం చేయాలని ప్రశ్నించారు. వచ్చిన మచ్చ ఎప్పటికీ పోదన్న దివ్వల మాధురి.. అందుకే దువ్వాడ శ్రీనివాస్‌తోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. దువ్వాడ శ్రీనివాస్ తనకు కేర్ టేకర్, ఫ్రెండ్, ఫిలాసఫర్ అని దివ్వల మాధురి చెప్పారు.
మరోవైపు తమ తండ్రిని కలవనివ్వాలంటూ దువ్వాడ శ్రీనివాస్ కుమార్తెలు హైందవి, నవీన గురువారం ఆయన ఇంటి వద్ద చేసిన హంగామాతో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. తమ తండ్రిని తమతో కలవకుండా దివ్వల మాధురి అడ్డుకుంటోందంటూ దువ్వాడ శ్రీనివాస్ కుమార్తెలు ఆరోపించారు. దీనిపైనే దివ్వల మాధురి తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు.