దేశంలో జెండా పండుగకు రంగం సిద్ధమవుతోంది. ఆగస్ట్ 15 స్వాతంత్య్ర దినోత్సవానికి యావత్ భారతావని ముస్తాబవుతోంది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం కూడా రాష్ట్ర, జిల్లా స్థాయిలో వేడుకలను నిర్వహించనుంది. సీఎం నారా చంద్రబాబు నాయుడితో పాటుగా మంత్రులు కూడా తమకు కేటాయించిన జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు ఏపీ సాధారణ పరిపాలనశాఖ ప్రోటోకాల్ విభాగం నుంచి ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. ఈ ఉత్తర్వుల ప్రకారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన ఇండిపెండెన్స్ డే వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఉదయం 9 గంటలకు సీఎం చంద్రబాబు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.
ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడలో జాతీయ జెండాను ఎగరవేయనున్నారు. మంత్రి నారా లోకేష్.. గుంటూరులో జాతీయ పతాకం ఆవిష్కరణ చేస్తారు.శ్రీకాకుళం జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు, కృష్ణా జిల్లాలో మంత్రి కొల్లు రవీంద్ర జాతీయ జెండాను ఎగురవేస్తారు. పల్నాడులో నాదెండ్ల మనోహర్, నెల్లూరులో నారాయణ, అనకాపల్లిలో హోం మంత్రి వంగలపూడి అనిత, చిత్తూరులో సత్యకుమార్ యాదవ్, పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి నిమ్మల రామానాయుడు జెండా పండుగలో పాల్గొంటారు.
కడప జిల్లాలో మంత్రి ఫరూక్ జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. అలాగే తిరుపతి జిల్లాలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.. అనంతపురం జిల్లాలో పయ్యావుల కేశవ్, విశాఖ జిల్లాలో అనగాని సత్యప్రసాద్, ఏలూరు జిల్లాలో కొలుసు పార్థసారధి, ప్రకాశం జిల్లాలో డోలా బాలవీరాంజనేయ స్వామి జెండాను ఆవిష్కరించి వందనం సమర్పిస్తారు. అలాగే..
బాపట్ల జిల్లా - గొట్టిపాటి రవికుమార్
తూర్పుగోదావరి జిల్లా - కందుల దుర్గేష్
పార్వతీపురం మన్యం జిల్లా - సంధ్యారాణి
నంద్యాల జిల్లా - బీసీ జనార్ధన్ రెడ్డి
కర్నూలు జిల్లా - టీజీ భరత్
సత్యసాయి జిల్లా - సవిత
అమలాపురం - వాసంశెట్టి సుభాష్
విజయనగరం - కొండపల్లి శ్రీనివాస్
అన్నమయ్య జిల్లా- మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి
అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలెక్టర్ దినేశ్‌కుమార్ పతాకాన్ని ఆవిష్కరిస్తారు.