విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఆదివాసి దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. గిరిజన సంప్రదాయ నృత్యాల్లో కళాకారులతో పాటు చంద్రబాబు సైతం పాల్గొన్నారు. కళాకారుల డప్పు తీసుకుని స్వయంగా డప్పు వాయించారు. గిరిజన లంబాడి కళాకారులతో సరదాగా కాసేపు ముచ్చటించారు. గిరిజన సంప్రదాయమైన కొమ్మ కోయ ధరించి కళాకారులతో చంద్రబాబు జత కలిశారు. గిరిజనలు ప్రదర్శించిన ఉత్పత్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గిరిజనులు తయారు చేసిన కాఫీని సేవించారు. ఆ తరువాత ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, వసంత కృష్ణ ప్రసాద్ పక్కనున్న అధికారులను పిలిచి మరీ వారితో కాఫీ తాగించారు.