శ్రీకాకుళం వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తుపాకీ లైసెన్స్‌కు దరఖాస్తు చేశారు. తన దగ్గర తుపాకీ ఉందని.. దానికి లైసెన్స్ ఇవ్వాలని కోరుతూ ఎస్పీ మహేందర్ రెడ్డికి ఈనెల 7న దువ్వాడ దరఖాస్తు చేసుకున్నారు. తనకు కొంత మంది వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపారు. అలాగే కొంత మంది తన ఇంటి వద్ద అనుమానంగా రెక్కీ నిర్వహిస్తున్నారని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో తన వద్ద ఉన్న తుపాకీకి లైసెన్స్ మంజూరు చేయాలని కోరారు. ఇదే విషయమై జులైలో కూడా టెక్కలి పోలీసులకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. గుర్తు తెలియని నెంబర్ నుంచి తనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని టెక్కలి సీఐకు తెలిపారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. నిందితుల నుంచి తనకు ప్రాణ హానీ ఉందని... కావు 4+4 గన్‌మెన్లను కేటాయించాలని ప్రభుత్వానికి కూడా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వినతి చేసిన సంగతి తెలిసిందే.