అమలాపురం జిల్లాలో రైతులకు బకాయి పడ్డ రూ.192 కోట్ల ధాన్యం బకాయిలను ఈ నెల 12న రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విడుదల చేయనున్నారని పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ డీవీఎస్ యల్లారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 12న మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్లోని గోదావరి భవన్లో నిర్వహించే కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ పాల్గొని ధాన్యం బకాయిలు విడుదల చేస్తారన్నారు.