ఎట్టకేలకు మండలాలకు తహశీల్దార్ల నియామకాలు పూర్తయ్యాయి. ఎన్నికల విధుల నిమిత్తం వేరే జిల్లాలకు వెళ్లిన తహశీల్దార్లు ఇటీవల రిలీవై ఇక్కడ రిపోర్టు చేసిన సంగతి తెలిసిందే. వారం రోజుల కిందటే తహశీల్దార్ల నియామకం జరగాల్సి ఉంది. కానీ వరదలు, భారీ వర్షాల వల్ల ఇక్కడ విధుల్లో ఉన్నవారిని కదిపితే సహాయక చర్యలకు ఇబ్బంది అవుతుందనే కారణంతో ఆపారు. రాజమహేంద్రవరం జిల్లాలో మొత్తం 17 మందిని నియమిస్తూ గురువారం రాత్రి కలెక్టర్ పి.ప్రశాంతి ఉత్తర్వులు జారీ చేశారు.జిల్లా కలెక్టరేట్ మెజిస్ర్టీరియల్ సెక్షన్ సూపరిం టెండెంట్‌గా జీఎఎల్‌ఎస్.దేవి నియమితులయ్యారు. కలెక్టరేట్ ఏవోగా పీహెచ్‌జీఆర్ పాపారావు, రాజమహేంద్రవరం ఆర్డీవో కార్యాలయ ఏవోగా ఎం.సుజాత, కొవ్వూరు సబ్-కలెక్టర్ కార్యాలయ ఏవోగా జీఎస్‌ఎస్ జవహర్ బాజి, కెఆర్‌ఆర్‌సీ స్పెషల్ తహశీల్దార్‌గా ఎం.రామకృష్ణ ,కలెక్టరేట్‌లో లాండ్స్ సెక్షన్ సూపరింటెండెంట్‌గా ఎం.మసూద్ అలీ నియమితులయ్యారు. ఇక బిక్కవోలు తహశీల్దార్‌గా డబ్ల్యుఎల్.రమణి, కోరుకొండ తహశీల్దార్‌గా వి.సుస్వాగతం, గోకవరం తహశీల్దార్‌గా వై.సరస్వతి, కడియం తహశీల్దా ర్‌గా కె.పోసిబాబు, రాజమహేంద్రవరం అర్బన్ తహశీల్దార్‌గా జేవీఆర్.ర మేష్, చాగల్లు తహశీల్దార్‌గా మెరిపే మెరికమ్మ, నిడదవోలు తహశీల్దార్‌గా బి.నాగరాజునాయక్, పెరవలి తహశీల్దార్‌గా డి.అచ్యుత కుమారి, తాళ్లపూ డి తహశీల్దార్ వి.రవీంద్రనాథ్, కొవ్వూరు తహశీల్దార్‌గా జి.కనకరాజు, ఉండ్రాజవరం తహశీల్దార్‌గా పీఎన్‌డీ.ప్రసాద్ నియమితులయ్యారు. తక్షణం వీరంతా విధుల్లో చేరవలసి ఉంది.