నిడదవోలు నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.11 కోట్లు మంజూరు చేసిందని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలు మండలం సమిశ్రగూడెం, గోపవరం, పురుషోత్తపల్లి, డి.ముప్పవరం, పందలప్రరు, పెరవలి మండలం కానూరు, నడిపల్లి, కానూరు అగ్రహారం, తీపర్రు, ఉండ్రాజవరం మండలం పాలంగి, కె.సావరం, చివటం, వడ్లూరు, సూర్యారావుపాలెం గ్రామాల్లో అంతర్గత రహదారి పనులకు ఆయన గురువారం శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే పంచాయతీరాజ్, ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధుల నుం చి రూ.11 కోట్లు మంజూరు చేసిందని, దీంతో గ్రామాల్లో రహదారి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. రోడ్ల నిర్మాణంలో కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలను పాటించాలని, అధికార్లు పూర్తిస్తాయిలో పర్యవేక్షించాలన్నారు. త్వరలోనే డ్రైనేజీ వ్యవ స్థపై కూడా దృష్టి సారిస్తామన్నారు. కార్యక్రమాల్లో పంచాయతీరాజ్ ఎస్‌ఈ ఎండీ ఆలీముల్లా, డీఈఈ కె.రామ్మోహన్, ఏఈ సీహెచ్‌ఆర్‌కే శాస్ర్తి, ఎంపీడీవోలు జేఏ ఝాన్సీ, హిమమహేశ్వరి, పెరవలిలో భూపతిరాజు రవివర్మ, అతికాల రామకృష్ణమ్మ, వాకలపూడి వీర్రాజు, సీహెచ్ వెంకటనారాయణ, హనుమంతు సుబ్రహ్మణ్యం, పిప్పర రవి, పత్తిపాటి ప్రసాద్‌కుమార్, నందమూరి నారాయణరావు, మొగళ్ళపు సీతారామ్, సింహాద్రి సత్యనారాయణ, ఉండ్రాజవరంలో టీడీపీ మండలాధ్యక్షుడు సింహాద్రి రామకృష్ణ, జనసేన మండలాధ్యక్షుడు వీరమళ్ల బాలాజీ, జీవీ సుబ్రహ్మణ్యం, కాకర్ల కరుణాకర్, కాకర్ల నాని, ఎంపీపీ పాలాటి యల్లారీశ్వరి, పీఆర్ డీఈఈ కె.రామమోహన్ తదితరులు పాల్గొన్నారు.