బొబ్బిలి రాజా ఆర్వీజీకే రంగారావు 98వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన తనయుడు, ఎమ్మెల్యే బేబీనాయన గురువారం ఘనంగా నివాళులు అర్పించారు. స్థానిక తారకరామ కాలనీ సమీపంలో గల స్మృతివనం దగ్గరికి బేబీనాయన వెళ్లి రాజా సమాధి దగ్గర సంప్రదాయ సిద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్య క్రమంలో రెడ్డి రామమూర్తి, బదరి ప్రసంగించారు. దివంగత రాజా రంగారా వుతో ఉన్న గత అనుభవాలను నెమరువేసుకున్నారు. కార్యక్రమంలో పార్వతీ పురం మాజీ ఎం.ఎల్.ఎ బొబ్బిలి చిరంజీవులు, స్థానిక టీడీపీ నేతలు పువ్వల శ్రీనివాసరావు, సుంకరి సత్తి బాబు, ఏగిరెడ్డి శ్రీధర్, కౌన్సిలర్లు బొత్స సురేష్, కళ్యంపూడి సత్యనారాయణ, సింగనాపల్లి ఈశ్వరరావు, తెంటు వెంకటప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. బొబ్బిలి సంస్థానం ఉన్నత పాఠశాల, రాజా ఆర్.ఎస్.ఆర్.కె రంగారావు క ళాశాల, శ్వేతాచలపతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో దివంగత రాజా ఆర్వీ జీకే రంగారావు వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఆటల పోటీ లు నిర్వహించి విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు.