ప్రభుత్వ ఆసుప త్రులలో నాణ్యమైన వైద్యసేవలు అందించాలని కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. గురువారం ఆయన కుందూరు ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు పట్టీ, రికార్డులు పరిశీలించారు. వైద్య సిబ్బందితో మాట్లాడారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు అవసరమైన వైద్యపరీక్షలు, రక్తపరీక్షలు నిర్వహించాలని సూచించారు. వైద్యాధికారిణి రత్నసుధ, వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. గ్రామానికి చెందిన ిసీహె చ్.సత్యవతి తనకు కళ్లు సరిగా కనపడటంలేదని సహాయం చేయాలని కోరగా మం త్రి సుభాష్ రూ.10,000లు ఆర్థిక సాయం చేశారు. మెరుగైన వైద్యం చేయించి, పింఛను వచ్చే విధంగా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కూ టమి నాయకులు పామర్తి బాబి, జగతా రమణ, మేడిశెట్టి బాబి, పళ్ల చినబాబు, సిర్రా సురేష్, తాడి చంటి, మండి రమణ పాల్గొన్నారు.