గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలోని శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామిని శ్రావణమాసం మొదటి శనివారం ఏపి రాష్ట్ర రాయలసీమ జైలు శాఖ డీఐజి వరప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, వేద పండితులు, అర్చకులు ఆయనకు గౌరవంగా పూర్వకంగా స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షణం అనంతరం వారి గోత్ర నామాలతో అర్చకులు స్వామివారికి పూజలు చేశారు. అనంతరం స్వామి వారి శేష వస్త్రం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.