ఏపీ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ టి. సునీల్ చౌదరి కుమార్తె వివాహం శుక్రవారం ఆయన స్వగ్రామమైన కారంచేడులో జరిగింది. ఈ వివాహ వేడుకలకు ఏపీ, తెలంగాణా రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులు పలువురు హాజరయ్యారు. నూతన దంపతులను వారు ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి, జస్టిస్ చీమలపాటి రవి, పలువురు రాజకీయ ప్రముఖులు హాజరైన వారిలో ఉన్నారు.