మంగళగిరి పరిధి ఎన్నారై జంక్షన్ వద్ద శుక్రవారం రాత్రి నిర్వహించిన వాహన తనిఖీల్లో 29 కేసులు నమోదు చేసినట్లు మంగళగిరి రూరల్ ఎస్ఐ సీహెచ్ వెంకట్ తెలిపారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు చేపట్టిన తనిఖీల్లో డ్రంక్ అండ్ డ్రైవ్, త్రిబుల్ రైడింగ్, సరైన ధ్రువపత్రాలు లేని వారిపై కేసు నమోదు చేశామన్నారు. కార్యక్రమంలో ట్రైనీ డిఎస్పీ భార్గవి, స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.