ఇంకొల్లు సీఐగా వై. వి రమణయ్య ఆదివారం పదవీ బాధ్యతలు చేపట్టారు. సిబ్బంది ఆయనకు సాదర స్వాగతం పలికారు. తదుపరి పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సీఐ రమణయ్య మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో రాజీలేకుండా పనిచేస్తామన్నారుమట్కా, గుట్కా, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలను ఉక్కుపాదంతో అణిచేస్తామన్నారు. గంజాయి బ్యాచ్ ని ఏరిపారేస్తామని, ప్రజలు కూడా తగిన సమాచారం ఇచ్చి పోలీసులకు సహకరించాలని సి. ఐ కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa