సెబీ లాంటి ఆర్థిక సంస్థను దెబ్బతీయడానికే విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని బీజేపీ ఆరోపించింది. ‘గత ఏడాది అదానీ కంపెనీలపై ఆరోపణలు చేసిన హిండెన్‌బర్గ్ భారత దర్యాప్తు సంస్థల విచారణను ఎదుర్కొంటోంది. ఇటువంటి నివేదికలు విదేశీ గడ్డలపై నుంచి పార్లమెంటు సమావేశాల సమయంలోనే విడుదలవుతుంటాయి’ అని బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌తో భాగస్వామ్యమున్న హిండెన్‌బర్గ్ దురుద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తోందన్నారు.