సెబీ ఛైర్ పర్సన్ మాధవి పురి బచ్ పై ఆధారాలతో సహా హిండెన్‌బర్గ్ ఆరోపణలు చేసిందని, దీనిపై తగు దర్యాప్తు చేసే వరకు ఆమెను పదవి నుంచి తప్పించాలని సిపిఎం డిమాండ్ చేసింది. మాధబి పురి, ఆమె భర్తకు అదానీ గ్రూపులోని షాడో కంపెనీల్లో వాటాలున్నాయని పరిశోధనా సంస్థ ఆధారాలతో బయటపెట్టిందని తెలిపింది. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తునకు జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని పొలిట్యూరో డిమాండ్ చేసింది.