శబరిమల అయ్యప్ప సన్నిధానం వ్యవహారాలను చూసే ట్రావెన్ కోర్ బోర్డుకు కేరళ ప్రభుత్వం రూ. 100 కోట్లు మంజూరు చేసింది. గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్ ఈ మేరకు ప్రకటించారు. వరదలు, వివాదాల కారణంగా ఈ ఏడాది శబరిమల దేవస్థానం ఆదాయం తగ్గిందనే వాదనలు ఉన్నాయి. బడ్జెట్‌లో శబరిమలకు రూ. 100 కోట్లు ప్రకటించిన ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్... శబరిమల ఆలయ ఆదాయాన్ని ప్రభుత్వం దోచుకుంటోందని కొందరు రాజకీయ నాయకులు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
శబరిమల ఆలయానికి ఆదాయం రాకుండా కొందరు చేస్తున్న ప్రయత్నాల కారణంగా ఆలయ బోర్డు ఇబ్బంది పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్థికమంత్రి థామస్ ఇసాక్ అన్నారు. శబరిమల దేవస్థానం నుంచి ప్రభుత్వం ఒక్క పైసా కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు. కొందరు నేతలు కావాలనే ఈ అంశంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. శబరిమలతో పాటు మలబార్, కొచ్చిన దేవస్థానాలకు కూడా బడ్జెట్‌లో రూ. 36 కోట్లు కేటాయించినట్టు మంత్రి వివరించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతి తరహాలో శబరిమలలో సౌకర్యాలు కల్పించాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
ట్రావెన్ కోర్ బోర్డుకు కేటాయించిన రూ. 100 కోట్లతో పాటు శబరిమల కేరళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ బోర్డు ద్వారా రూ. 141 కోట్లు విలువైన అభివృద్ధి పనులను కూడా శబరిమల పరిసరాల్లో చేపట్టబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. నీలక్కల్, పంబా ప్రాంతాల్లో షెల్టర్లను నిర్మించబోతున్నట్టు వెల్లడించింది. వీటితో పాటు నీటి శుద్ధి కేంద్రాల కోసం 39.59 కోట్లు, రోడ్డు పనుల కోసం రూ. 200 కోట్లు, ఇతర సౌకర్యాల కల్పన కోసం 102.16 కోట్లు కేటాయిస్తున్నట్టు మంత్రి ప్రకటించారు. మొత్తంగా శబరిమల కోసం ప్రభుత్వం రూ. 629 కోట్లు కేటాయించిందని తెలిపారు.
ఏడాదికాలంలో సంభవించిన వరదలతో పాటు కొన్ని నెలలుగా కొనసాగిన వివాదాల కారణంగా శబరిమల ఆలయానికి వచ్చే ఆదాయంలో భారీగా గండిపడింది. ఈ నేపథ్యంలో తమకు ఆర్థికసాయం చేయాలని ట్రావెన్‌కోర్ బోర్డు కేరళ ప్రభుత్వాన్ని కోరింది. ఇందుకు సంబంధించిన ప్రభుత్వం బోర్డుకు రూ. 100 కోట్లు కేటాయించడంతో పాటు ఇతర కార్యక్రమాలకు రూ. 500 కోట్లకు పైగా కేటాయించింది. కేరళలోని శబరిమల ఆలయం హుండీల్లో ఎలాంటి డబ్బు వేయకుండా తమ నిరసన తెలియజేయాలని హిందూ సంఘాలు పిలుపునిచ్చాయి. ఆలయ ఆదాయం తగ్గడానికి ఇది కూడా కారణమైంది. మహిళల ఆలయ ప్రవేశం కారణంగా శబరిమలలో రెండు నెలల పాటు వివాదాలు కొనసాగడంతో ట్రావెన్ కోర్ దేవస్థానం ఆదాయానికి భారీగా గండిపడింది.
సౌత్‌లో 50 ఎంపీ సీట్లపై బీజేపీ గురి... సాధ్యమేనా? గెలుస్తారా?సౌత్‌లో 50 ఎంపీ సీట్లపై బీజేపీ గురి... సాధ్యమేనా? గెలుస్తారా?మలయాళీలకు వెన్నుపోటు అనే డీఎన్ఏ సమస్య ఉంది..: కేంద్రంమంత్రి కేజే అల్ఫోన్స్మలయాళీలకు వెన్నుపోటు అనే డీఎన్ఏ సమస్య ఉంది..: కేంద్రంమంత్రి కేజే అల్ఫోన్స్మోహన్ లాల్‌కు ఘోర అవమానం.. పద్మభూషణ్‌పై ట్రోలింగ్..మోహన్ లాల్‌కు ఘోర అవమానం.. పద్మభూషణ్‌పై ట్రోలింగ్..కమ్యూనిస్టులకు మన సంస్కృతి అంటే చిన్నచూపు..: శబరిమల వివాదంపై మోదీకమ్యూనిస్టులకు మన సంస్కృతి అంటే చిన్నచూపు..: శబరిమల వివాదంపై మోదీ51 కాదు..17 మందే...శబరిమలకు వెళ్లిన మహిళలపై కొత్త లిస్ట్51 కాదు..17 మందే...శబరిమలకు వెళ్లిన మహిళలపై కొత్త లిస్ట్
మరోవైపు తమపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టడంతో పాటు హిందూ సంఘాలను సంతృప్తి పరచేందుకే కేరళలోని వామపక్ష ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనే ప్రచారం కూడా జరుగుతోంది. శబరిమల అంశాన్ని వివాదం చేసి కేరళలో బలపడేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని భావిస్తున్న వామపక్షాలు... వారికి కౌంటర్‌గానే ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa