కౌతాళం మండలంలోని ఉరుకుందలో వెలసిన శ్రీ నరసింహ ఈరన్నస్వామి దేవస్థాన ఆలయ జీర్ణోద్ధరణ కొరకు సి బెళగల్ వాస్తవ్యులైన మంగమ్మ మరియు గ్రామ ప్రజలు రూ. 52, 640 సోమవారం విరాళంగా అందజేశారు. అధికారులు దాతలకు శ్రీ స్వామి దర్శనం, స్వామివారి శేష వస్త్రాము, లడ్డూ ప్రసాదాలు, ఆశీర్వాదాలు కల్పించి, బాండు పేపర్, పూలమాలతో సత్కరించారు. ఇందులో సీనియర్ అసిస్టెంట్ కిరణ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ కుమారయ్య పాల్గొన్నారు.