శ్రావణ మాసం రెండవ సోమవారం సందర్భంగా ఎమ్మిగనూరు డిపోలో ఊరుకుంద స్పెషల్ డ్యూటీ చేయు ఆర్టీసీ సిబ్బందికి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ తరపున భోజన పాకెట్లను అందజేసినట్టు ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు శ్రీనివాసులు సోమవారం తెలిపారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఊరుకుంద ఈరన్న స్వామి డ్యూటీ చేసే ఉద్యోగులకు భోజన వితరణ చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.