దాచేపల్లి నగర పంచాయతీలోని జలగడ బజార్లో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా గర్భిణీ స్త్రీలకు సోమవారం పాల సంజీవని పంపిణీ చేశారు. కార్యక్రమంలో 3వ వార్డు కౌన్సిలర్ షేక్ జానీ బాషా పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అంగన్వాడీ కేంద్రాలకు బాల సంజీవని కార్యక్రమం ద్వారా పోషక విలువలు కలిగిన ఆహార అందించడం జరుగుతుందని తెలిపారు.