రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు చెప్పారు. సోమవారం ఈపూరు మండలం కొచ్చర్ల గ్రామంలో జరిగిన రాయితీపై రైతులకు విత్తనాలు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతులపై భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలు ఎరువులు అందిస్తుందన్నారు. ప్రతి రైతు తప్పనిసరిగా పంట నమోదు చేసుకోవాలని సూచించారు.