కొయ్యలగూడెం లో డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వంలో సాధ్యం చేస్తామని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు హామీ ఇచ్చారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పూర్వ విద్యార్థులు ఏర్పాటుచేసిన సరస్వతి విగ్రహాన్ని ఆదివారం డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంతో కాలంగా డిగ్రీ కాలేజీ కలగానే మిగిలిపోయిందని, కానీ తమ ప్రభుత్వంలో ఏర్పాటుచేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. కొయ్యలగూడెం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి చేస్తామన్నారు. అనంతరం ఎస్సీ హాస్టల్స్‌ను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. కరాటం సాయి, బొల్లిన నిర్మలకిషోర్, వెంకటరమణ, మాదేపల్లి శ్రీను, తోట రవి, దుగ్గిన శ్రీను, నక్కా బాబి, పూర్వ విద్యార్థులు సత్యనారాయణ, దీక్షితులు, మంతెన సోమరాజు, గంటా శ్రీను, తదితరులు పాల్గొన్నారు.