ప్రజాసంక్షేమమే ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. పెద్దకోట గ్రామంలో వెలసిన కోటదుర్గమ్మను ఆదివారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపేందుకు విదేశీ పెట్టుబడులకు అధిక ప్రాధాన్యం ఇస్తు న్నారన్నారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ మండల నాయ కులు కె.మన్మఽథరావు, కె.కృష్ణమాచారి, ఎస్.మోహనరావు, జి.గణేశ్, కె.ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.