కూటమిప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా వారికి పెద్ద పీట వేస్తోందని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు. ఆదివారం వట్టిగెడ్డ రిజర్వాయర్ కుడికాలువ ద్వారా 80 క్యూసెక్కులు, ఎడమకాలువ ద్వారా 25 క్యూసె క్కుల నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా రిజర్వాయర్‌లో నీటి నిల్వ పరిస్థితిని నీటి పారుదలశాఖ డీఈఈ ఉదయ్‌భాస్కర్, ఏఈలు జీవీ రఘు, వినయ్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 399 అడుగులు కాగా 382 అడుగులు మాత్రమే ఉందని ఏఈ వివరించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ పండిన ప్రతి వరిగింజను కొనుగోలు చేయడానికి ఇప్పటి నుంచే ముం దస్తు ప్రణాళికలు వేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బి.సురేష్, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి దత్తి లక్ష్మణరావు, అరకు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధికార ప్రతినిధి డొంకాడ రామకృష్ణ, టీడీపీ నాయకులు దేవకోటి వెంకటనాయుడు, ఎం.సత్యంనా యుడు, రెడ్డి బలరామస్వామినాయుడు, మాజీ వైస్ ఎంపీపీ ఎం.చంద్రమౌళి, లంక గోపాలం, జనసేన నాయకులు రంజిత్‌కుమార్ పాల్గొన్నారు.